రూల్స్ బ్రేక్ చేస్తే బ్లాక్‌లిస్టే.. మంత్రి సీతక్క హెచ్చ‌రిక‌

రూల్స్ బ్రేక్ చేస్తే బ్లాక్‌లిస్టే.. మంత్రి సీతక్క హెచ్చ‌రిక‌

అంగన్వాడీలకు సరఫరా అవుతున్న సరుకుల నాణ్యతపై మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. స‌రుకుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా త‌నిఖీలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరైన సరుకులు అందించకపోతే సప్లయర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని తేల్చి చెప్పారు.

అధికారులకు స్పష్టమైన సూచనలు
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహార నాణ్యతపై రాజీ పడలేమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అందుకు సంబంధించి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సరుకుల నాణ్యత, పరిమాణం నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని చెప్పారు.

ఇటీవల అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న వస్తువుల నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో మంత్రి సీతక్క ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. తగిన చర్యలు తీసుకొని అంగన్వాడీల్లో సరుకుల నాణ్యతను కాపాడాలని అధికారులకు కఠిన సూచనలు జారీ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment