మహిళల (Women’s) కోసం అమలవుతున్న ఉచిత బస్సు పథకం(Free Bus Scheme)పై కూటమి ప్రభుత్వం (Coalition Government)లోని మంత్రి సత్యకుమార్ (Satya Kumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ పథకాన్ని మహిళలు విస్తృతంగా వినియోగిస్తున్నారంటూ, కానీ వినియోగించే తీరుపై సెటైర్లు వేసిన ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహిళలు పక్క ఊర్లో అమ్మను చూడటానికి, అత్తను కలవడానికి రోజూ బస్సులో వెళ్తున్నారని, అంతేకాకుండా “ఉదయం ఒక సీరియల్ (Serial), మధ్యాహ్నం ఒక సీరియల్, రాత్రి మరో సీరియల్‌ను వేరువేరు ప్రాంతాల్లో చూసేందుకు కూడా ఈ ఫ్రీ బస్సును ఉపయోగిస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగా తోటికోడలితో ఫోన్‌లో కొట్లాడకుండా, ఇప్పుడు ఉచిత బస్సులో వెళ్లి మరీ గొడవపడి సాయంత్రానికి ఇంటికొచ్చేస్తున్నారని మంత్రి చెప్పిన మాటలు మహిళల కోపానికి గురిచేశాయి.
ఆడవారి ఫ్రీ బస్సు పథకాన్ని సీరియల్స్ చూడటానికి, గొడవలకు వేదికగా చూపించడం తగదని కూటమి నేతలు ఆక్షేపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకంపై కూటమి ప్రభుత్వ మంత్రి సెటైర్లు పేల్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని మహిళలను అవమానించేలా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇటీవలి కాలంలో ఫ్రీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు పురుషులతో ఘర్షణపడుతూ, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్న వీడియోలు కూడా వైరల్ కావడంతో ఈ అంశంపై మరింత చర్చ మొదలైంది.