రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అనుచరుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడికి పాల్పడిన కేసులో టీడీపీ నేత రవికుమార్ అరెస్టు అయ్యాడు. లైంగిక వేధింపుల కేసులో టీడీపీ నేత సెబ్బిలి రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దంపతుల మధ్య వివాదాలు సృష్టించి వారిని విడదీసిన ఒంటరిగా ఉన్న కూతురు వరుస అయిన సదరు దళిత మహిళతో చనువు పెంచుకున్నారు. ఆ చనువును ఆసరాగా చేసుకొని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. విషయం బయటకు తెలిస్తే తన పరువుపోతుందని భావించి బాధితురాలిని మలేషియాకు తరలించాడు.
బాధిత మహిళ కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రవికుమార్ ఆమెను విజయవాడకు తీసుకొచ్చి రహస్యంగా ప్రసవం చేయించాడు. పుట్టిన బిడ్డకు తానే తండ్రినని సంబంధిత ధ్రువపత్రాలపై సంతకాలు కూడా చేశాడు. ఆ తరువాత సదరు మహిళకు రెండో పెళ్లి చేసి పంపాడు. అయితే తన డబ్బు, నగలు, ఆస్తిని రవికుమార్ కాజేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.రాజకీయ పలుకుబడితో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడ్ని, చివరికి కోర్టు ఆగ్రహించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.