పార్కింగ్ గొడ‌వ‌.. నటి బంధువు హత్య

పార్కింగ్ గొడ‌వ‌.. నటి బంధువు హత్య

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. నిజాముద్దీన్ ప్రాంతంలోని జంగ్‌పురా భోగల్ లేన్‌లో రాత్రి 11 గంటల సమయంలో జరిగిన చిన్నపాటి వాగ్వాదం రక్తపాతం వరకు వెళ్లింది.

నటి హ్యూమా ఖురేషీ బంధువు అసిఫ్ ఖురేషీ ఓ ఇంటి గేటు వద్ద టూ వీలర్ పార్క్ చేయగా, అక్కడి వ్యక్తులతో మాటమాట పెరిగింది. ఆ తగవు క్షణాల్లోనే ఉధృతమై, కొందరు పదునైన ఆయుధాలతో అసిఫ్‌పై దారుణంగా దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన అసిఫ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై నిజాముద్దీన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment