ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన మధ్యాహ్న భోజనం పథకాన్ని నేడు ప్రారంభించింది. ఈ పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విజయవాడ జిల్లా పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనం అందించి, వారి విద్యకు మరింత ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఈ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం రూ.27.39 కోట్లు వెచ్చిస్తోంది. అంతేకాకుండా, వచ్చే విద్యా సంవత్సరంలో మరింత విస్తృతంగా అమలు చేయడానికి రూ.85.84 కోట్లు కేటాయిస్తామ‌ని చెప్పారు. ఇది విద్యార్థుల ఆరోగ్యం, విద్యా మెరుగుదలకు ప్రభావవంతమైన చర్యగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు బాగా చ‌దువుకుని ఉత్త‌మ ఫ‌లితాలు సాధించాల‌ని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment