హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ అనుమానాస్పద మృతి

హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ అనుమానాస్పద మృతి

హాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ (39) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. న్యూయార్క్ మాన్‌హట్టన్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో పడి ఉంద‌ని, న్యూయార్క్ టైమ్స్ ఈ ఘటనను వెల్లడించింది. ‘‘బఫీ ది వాంపైర్ స్లేయర్’’, ‘‘గాసిప్ గర్ల్’’ వంటి హిట్ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మిచెల్ మరణం ఫిల్మ్ ఫ్రటర్నిటీని షాక్‌కు గురిచేసింది.

చికిత్స విఫలమై..?
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మిచెల్‌ను ఆస్పత్రికి తరలించగా, అత్యవసర వైద్య సిబ్బంది ఆమె అప్పటికే మృతిచెందిందని ధృవీకరించారు. కానీ ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం మిచెల్ ఇటీవల కాలేయ మార్పిడి చేయించుకున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాలేయ మార్పిడి వికటించడం వల్లే ఈ విషాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మిచెల్ ఆకస్మిక మృతి ఆమె అభిమానులను, సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment