ఒబామా దంపతుల విడాకుల వార్తలపై క్లారిటీ

ఒబామా దంపతుల విడాకుల వార్తలపై క్లారిటీ

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వార్తలపై మిషెల్ టీమ్ స్పష్టతనిచ్చింది. విడాకుల వార్తలు పూర్తిగా నిరాధారమని, అవి వాస్తవం కాదని వెల్లడించింది. అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి మిషెల్ హాజరుకాలేకపోవడం వెనుక వ్యక్తిగత కారణాలున్నాయని టీమ్ తెలియజేసింది.

ఆనవాయితీకి బ్రేక్ ఇచ్చిన మిషెల్
అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి మాజీ అధ్యక్షులు, వారి భార్యలు హాజరవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ సంప్రదాయానికి మిషెల్ బ్రేక్ ఇవ్వనున్నారు. ఇటీవల జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి మిషెల్ హాజరుకాలేకపోయారు. హవాయిలో ఉండడం వల్లే ఆమె రాలేకపోయారని ఆమె టీమ్ వివరణ ఇచ్చింది.

ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం
మిషెల్ ఒబామా నిర్ణయాలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన “జాత్యహంకార వ్యాఖ్యలు” ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల వల్ల ఒబామా దంపతులపై వస్తున్న ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లైంది. అయితే, మిషెల్ టీమ్ స్పందనతో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. 1992లో వివాహం చేసుకున్న బరాక్, మిషెల్ దంపతులకు సాషా, మలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2009లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో మిషెల్ ఓ ఇంటర్వ్యూలో తమ వైవాహిక బంధంలో వచ్చిన చిన్న చిన్న మనస్పర్థలను కౌన్సెలింగ్ ద్వారా అధిగమించామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment