ఎంజీఎం ఆస్ప‌త్రిలో సంచలనం: ఒక్కరోజే 77 మందికి మెమోలు

ఎంజీఎం ఆస్ప‌త్రిలో సంచలనం: ఒక్కరోజే 77 మందికి మెమోలు

వరంగల్ (Warangal) నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ ఎంజీఎం ఆస్ప‌త్రిలో (MGM Hospital) సిబ్బంది నిర్లక్ష్యం సంచలనంగా మారింది. విధి నిర్వహణలో విఫలమైన కారణంగా ఏకంగా 77 మంది సిబ్బందికి మెమోలు (Memos) జారీ చేయడం ఆస్ప‌త్రి పరిపాలనలో ఉన్న లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy), ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య (Baswaraju Saraiah) ఎంజీఎం ఆస్ప‌త్రికి ఆకస్మికంగా తనిఖీకి వచ్చారు. ఈ సందర్బంగా వైద్యులు విధులకు హాజరుకాలేదు, శానిటేషన్ పరిస్థితి దారుణంగా ఉంది అని వారు గమనించారు. వీటిని చూసిన ప్రజాప్రతినిధులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కాలెక్టర్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే
దీంతో ఎమ్మెల్యే నాయిని వరంగల్ కలెక్టర్‌కు (Warangal Collector) ఫోన్ చేసి అధికారుల నిర్లక్ష్యాన్ని వివరించారు. స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలకు ఆదేశించారు. ఉద్యోగుల నిర్లక్ష్యంపై వివరణ కోరుతూ మెమోలు జారీ చేయాలని చెప్పారు. క‌లెక్ట‌ర్‌ ఆదేశాల మేరకు ఆస్ప‌త్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ (Dr. Kishore Kumar) ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టారు. రిజిస్టర్లో సంతకాలు చేయని వారు, విధులకు హాజరుకాని వైద్యులు, సిబ్బందిని గుర్తించి మెమోలు జారీ చేశారు. ఒకేరోజులో 77 మందికి మెమోలు జారీ కావడం ఈ ఆస్ప‌త్రి చరిత్రలోనే తొలిసారి.

హెచ్చరికగా నిలిచే చర్య
ఈ పరిణామం ప్రభుత్వ వైద్య వ్యవస్థలో నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో తెలిపే ఉదాహరణగా నిలిచింది. ప్ర‌జారోగ్యంపై ప్రభావం చూపే ఈ నిర్లక్ష్యాలపై చర్యలు తీసుకోవడమే కాక, ఇతర ఆస్ప‌త్రులకు కూడా ఇది హెచ్చరికగా మారే అవకాశం ఉంది. పారదర్శకత, క్రమశిక్షణపై ప్రభుతానికి ఇది ఒక కీలక సంకేతంగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment