మెటాలో భారీగా ఉద్యోగ కోతలు.. మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం!

మెటాలో భారీగా ఉద్యోగ కోతలు.. మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం!

టెక్ దిగ్గజం మెటా (META) మరోసారి ఉద్యోగ కుదింపుల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థ పనితీరు మెరుగుపరిచే క్రమంలో సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్కువ పనితీరు కనబరుస్తున్న 3,600 మంది ఉద్యోగులను తొలగించేందుకు మెటా సిద్ధమైంది. ఈ చర్యతో కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5% వరకు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

జుకర్‌బర్గ్ వివ‌రాల‌ ప్రకారం.. “పనితీరు ఆధారంగా తీసుకునే ఈ నిర్ణయం కంపెనీ బలోపేతానికి దోహదపడుతుంది. తక్కువ పనితీరు చూపిస్తున్న స్థానాలను మెరుగైన ప్రతిభ కలిగిన కొత్త ఉద్యోగులతో భర్తీ చేస్తాం” 2023 సెప్టెంబర్ నాటికి మెటాలో 72,400 మంది పనిచేస్తున్నారు.

టెక్ పరిశ్రమలో సాధారణమేనా ఉద్యోగ కోతలు?
టెక్ రంగంలో ఉద్యోగ కోతలు కొత్త కాదు. మెటా ముందు, మైక్రోసాఫ్ట్ కూడా తన ఉద్యోగుల్లో చిన్న శాతం కోతలు విధించినట్లు ప్రకటించింది. అయితే, మెటా తీసుకున్న తాజా నిర్ణయం మరింత ప్రాధాన్యత పొందుతోంది, ప్రత్యేకించి ట్రంప్ అధ్యక్ష పదవి ప్రారంభానికి ముందు అవడం వల్ల ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ట్రంప్-జుకర్‌బర్గ్ సంబంధాలు..
జుకర్‌బర్గ్, ట్రంప్ మధ్య గతంలో విభేదాలు ఉన్నా, ఇటీవల ఇద్ద‌రి మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. 2021లో ట్రంప్ అనుచరుల క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్‌ను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన మెటా, 2023లో ఖాతాను పునరుద్ధరించింది. ఇటీవల జుకర్‌బర్గ్, ట్రంప్ సమావేశమైనట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఫ్యాక్ట్ చెకింగ్ ఫీచర్ తొలగించడం కూడా ఈ క్రమంలో ఆసక్తి రేపుతోంది. ఈ ఫీచర్ సెన్సార్‌షిప్‌లా ఉందంటూ విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment