మెటా ర‌హ‌స్య‌ సమాచారం లీక్.. 20 మంది తొలగింపు

మెటా ర‌హ‌స్య‌ సమాచారం లీక్.. 20 మంది తొలగింపు

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta) మరోసారి వార్తల్లోకెక్కింది. కంపెనీకి చెందిన గోప్యమైన సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారనే ఆరోపణలతో 20 మంది ఉద్యోగులను సంస్థ తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించింది. మరింత మందిని తొలగించే అవకాశముందని సమాచారం.

జుకర్‌బర్గ్ సమావేశాల అనంతరం..
మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఇటీవల వరుస సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. సంస్థలో జరిగిన అంతర్గత దర్యాఫ్తులో 20 మంది దోషులుగా తేలగా, వారు సంస్థకు సంబంధించిన రహస్య సమాచారం బయటకు చేరవేశారని మెటా ప్రతినిధులు వెల్లడించారు.

ఉద్యోగులకు మేనేజ్‌మెంట్ హెచ్చరిక
మెటా మేనేజ్‌మెంట్ స్పష్టంగా ప్రకటించింది. భవిష్యత్తులో సంస్థ సమాచారాన్ని లీక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఘటన మరింత మంది ఉద్యోగుల భద్రతపై ప్రశ్నార్ధకంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment