ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తుది సమరం మొదలైంది. ఇండియా – న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుకెక్కాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో కలిపి వరుసగా 15వ వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడిపోయాడు. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి టీమిండియా వన్డే మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తొలుత బ్యాటింగ్‌కు దిగనున్నట్లు తన నిర్ణయాన్ని వెల్లడించారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 23 ఓవర్లకు గానూ 108 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలింగ్ లైనప్‌తో కివీస్ బ్యాటర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, వరణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.








