భారీ ఆర్థిక మోసాల్లో (Financial Scams) ప్రధాన నిందితుడి (Prime Accused) గా ఉన్న మెహుల్ చోక్సీ (Mehul Choksi) ను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బెల్జియం పోలీసులు అరెస్ట్ (Arrested) చేసినట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి రూ.13,500 కోట్ల రుణ మోసం (Loan Fraud) కేసులో భారత్ (India) నుంచి పారిపోయిన అతడిని, భారత్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు విషయాన్ని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ప్రస్తుతం 65 ఏళ్ల వయసున్న చోక్సీ, ముంబై కోర్టు (Mumbai Court) జారీ చేసిన రెండు ఓపెన్ ఎండ్ అరెస్ట్ వారెంట్ల ఆధారంగా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు జైలు (Jail)లో ఉన్నాడు.
చోక్సీ, తన భార్య ప్రీతీతో కలిసి బెల్జియం (Belgium)లోని ఆంట్వెర్ప్ నగరంలో నివాసం ఉండగా, తన వైద్య చికిత్స కోసం అంటిగ్వా అండ్ బార్బుడాస్ దేశం నుంచి బయటకి వచ్చాడు. అయితే, అతను ఆరోగ్య సమస్యలను చూపిస్తూ బెయిల్ కోసం ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, చోక్సీ మేనల్లుడు (Nephew) మరియు ఈ కేసులో సహ నిందితుడైన నీరవ్ మోడీ (Nirav Modi) ని కూడా భారత్ ప్రభుత్వం లండన్ నుంచి దేశానికి తీసుకురావాలని యత్నిస్తోంది. 2018 జనవరిలో ఈ మోసం బయటపడేందుకు కొద్దిరోజుల ముందు, ఈ ఇద్దరూ దేశం విడిచి పారిపోయారు.