పెళ్లి వార్తలు అసత్యం.. సోషల్ మీడియాలో మెహరీన్ స్ట్రాంగ్ వార్నింగ్

పెళ్లి వార్తలు అసత్యం.. సోషల్ మీడియాలో మెహరీన్ స్ట్రాంగ్ వార్నింగ్

టాలీవుడ్ నటి మెహరీన్ కౌర్ (Mehreen Kaur) పెళ్లి (Marriage) గురించి సోషల్ మీడియాలో (Social Media) ఇటీవల వెలువడిన తప్పుడు కథనాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తనకు అసలు పరిచయం లేని వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు కొన్ని ఆర్టికల్స్ ప్రచురించడంపై మెహరీన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వార్తలు వైరల్ కావడంతో ఆమె మానసికంగా ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయంలో పెరుగుతున్న వేధింపుల నేపథ్యంలో మెహరీన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తన వికీపీడియా పేజీని (Wikipedia Page) ఎవరో హ్యాక్ (Hacked) చేసి, కేవలం “రెండు నిమిషాల పాపులారిటీ” కోసం తప్పుడు సమాచారాన్ని (Fake Information) చేర్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఈ విషయంపై మౌనం పాటించినప్పటికీ, ఈసారి వేధింపులు హద్దులు దాటడంతో స్పందించాల్సి వచ్చిందన్నారు. అసత్య వార్తలు తన వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పారు.

ఈ సందర్భంగా మెహరీన్ ఒక విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు. తాను ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదని, భవిష్యత్తులో పెళ్లి నిర్ణయం తీసుకుంటే అది తానే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారు తమను జర్నలిస్టులుగా పిలవకూడదంటూ ఘాటుగా విమర్శించారు. తన వ్యక్తిగత జీవితం గురించి సరైన సమాచారం చెప్పగలిగేది తానేనని స్పష్టం చేస్తూ, ఇలాంటి ఫేక్ ఎడిట్లు, కథనాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment