మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Konidela Chiranjeevi) తన 70వ పుట్టినరోజును నేడు (ఆగస్టు 22) జరుపుకుంటున్నారు. ఆయన డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్, యాక్షన్‌తో ఎన్నో దశాబ్దాలుగా కోట్లాదిమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గకుండా యాక్షన్‌కు సై అంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అల్లు అర్జున్ (Allu Arjun ) తో పాటు, వెంకటేశ్, సాయిదుర్గ తేజ్, తేజ సజ్జా, నారా రోహిత్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా చిరంజీవికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes) తెలియజేసి, ఆయనకు అభినందనలు తెలిపారు.








