తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలుకాకముందే మెగాస్టార్ మేనియా పీక్స్‌కు చేరింది. చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో అభిమానుల ఉత్సాహం హద్దులు దాటుతోంది. కటౌట్లు, పాలాభిషేకాలు వంటి సంప్రదాయాలకు మించి ఈసారి టికెట్ల వేలం (Tickets Auction)తోనే మెగా ఫ్యాన్స్ (Mega Fans) కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదు.
కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన తొలి టికెట్ వేలంలో ఓ బీజేపీ నాయకుడు (BJP leader) ఏకంగా రూ. 1,11,111 చెల్లించి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్‌ను సొంతం చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే ఉత్సాహం నరసాపురంలోని ప్రముఖ అన్నపూర్ణ థియేటర్ వద్ద కూడా కనిపించింది. అక్కడ జరిగిన వేలంలో తొలి టికెట్‌కు రూ. 1,02,000 పలకడం మెగాస్టార్ క్రేజ్‌కు మరో సాక్ష్యంగా నిలిచింది.
ముఖ్యంగా ఈ వేలాల ద్వారా వచ్చిన మొత్తం మొత్తాన్ని అభిమానులు వ్యక్తిగత అవసరాలకు కాకుండా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCT)కు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించడం అందరి మనసులు గెలిచింది. చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ అభిమానంతో పాటు బాధ్యతను కూడా జోడిస్తూ మెగా ఫ్యాన్స్ ఇచ్చిన ఈ సంకేతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వింటేజ్ చిరు కామెడీ, యాక్షన్ మిక్స్‌తో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.








