“కిష్కింధపురి” (Kishkindhapuri) సినిమాపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పందించారు. ఇటీవల విడుదలైన ఈ హర్రర్ థ్రిల్లర్, బెల్లంకొండ (Bellamkonda) సాయి శ్రీనివాస్ (Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటించగా, కౌశిక్ పగళ్ళపాటి (Kaushik Pagallapati) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే మంచి స్పందనతో థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. తాజాగా చిరంజీవి ఇచ్చిన రివ్యూ (Review)తో సినిమాకు మరింత బలం చేకూరింది.
చిరంజీవి తన వీడియో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “’కిష్కింధపురి’ సినిమా నాకు చాలా నచ్చింది. ఇది కేవలం ఒక హర్రర్ సినిమా మాత్రమే కాదు, దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి కథకు ఒక మానసిక (సైకలాజికల్) కోణాన్ని జోడించడం ఆసక్తికరంగా ఉంది. చైతన్ భరద్వాజ్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు సినిమాకు కొత్త శక్తిని తెచ్చాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ అద్భుతంగా నటించారు. వీరి నటనతో పాటు, సినిమా సాంకేతిక విలువలు కూడా చాలా బాగున్నాయి. నా తదుపరి చిత్రం ‘శివ శంకర వరప్రసాద్ గారు’ నిర్మాత సాహు గారపాటి ఈ సినిమాకు అండగా నిలబడ్డారు, ఆయన ప్రయత్నం ప్రశంసనీయం. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడండి, ఇది మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది” అని ప్రశంసించారు.
చిరంజీవి ఇచ్చిన ఈ సానుకూల రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది సినిమా బాక్సాఫీస్ వసూళ్లకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు.








