---Advertisement---

సీఎంతో భేటీకి మెగాస్టార్ గైర్హాజ‌రు.. కార‌ణం ఇదే

సీఎంతో భేటీకి మెగాస్టార్ గైర్హాజ‌రు.. కార‌ణం ఇదే
---Advertisement---

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరుగుతున్న సినీ ప్రముఖుల సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి గైర్హాజ‌ర‌య్యారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవికి పేరుంది. నేటి స‌మావేశాన్ని చిరంజీవే ముందుండి న‌డిపిస్తార‌ని అంద‌రూ భావించారు కానీ, ఆయ‌న హాజ‌రుకాక‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సీఎం రేవంత్‌తో స‌మావేశానికి సీనియర్ హీరోలలో నాగార్జున, వెంకటేశ్ మాత్రమే హాజరయ్యారు. నిర్మాత‌లు దిల్ రాజు, అల్లు అర‌వింద్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ స‌హా ప‌లువురు హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. చిరంజీవి తన మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ స‌మావేశానికి యువ హీరోలలో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్ పోతినేని, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment