మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆంజనేయ స్వామి (Anjaneya Swamy)కి ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆయన అయ్యప్ప స్వామి (Ayyappa Swamy ) మాల ధారణను కూడా వీలున్న ప్రతి ఏటా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా తాజాగా ఆయన మాలధారణ చేశారు.
ఈ విషయం ఎలా తెలిసిందంటే… చిరంజీవి ఇటీవల తన భార్య సురేఖ (Surekha)తో కలిసి ఒక ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలోనే ఆయన అయ్యప్ప మాలలో దర్శనమిచ్చారు. అయితే, దీపావళి రోజున జరిగిన ఉపాసన సీమంతం వేడుకలలో మాత్రం ఆయన మాల ధారణ చేసి కనిపించలేదు. అంటే దీపావళి తర్వాత ఆయన మాలధారణ చేశారని తెలుస్తోంది. కాగా, రామ్ చరణ్ కూడా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా అయ్యప్ప మాల ధారణ చేస్తారన్న సంగతి తెలిసిందే.
ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు’ అనే సినిమాలో నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.








