సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో (South Indian Cinema Industry) ప్రస్తుతం అత్యంత క్రేజీ హీరోయిన్‌గా (Trending Heroine) దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), తెలుగు(Telugu), తమిళ (Tamil)సినిమాలతో బిజీగా ఉంది. చేతినిండా సినిమాలతో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ఈ అమ్మడు, ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించినా, తన సినిమాపై వచ్చిన ట్రోల్స్ కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో స్టార్ స్టేటస్ సంపాదించింది.
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన ఓ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాతో మీనాక్షి చౌదరికి తెలుగులో ఆఫర్లు (Offers) క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె అనేక సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది ‘లక్కీ భాస్కర్’ (‘Lucky Bhaskar’) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మీనాక్షి, ఈ ఏడాది వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఓ చిత్రంలో నటించి అదరగొట్టింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
గతంలో తమిళ స్టార్ విజయ్ దళపతితో ‘గోట్’ (‘GOAT’) సినిమాలో నటించిన మీనాక్షి, ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోల్స్‌తో తీవ్ర బాధపడింది. ఆ వీడియోలు చూసి వారం రోజుల పాటు డిప్రెషన్‌లో ఉన్నానని ఆమె తెలిపింది. అయితే, ‘లక్కీ భాస్కర్’ సినిమా ఆమె మానసిక స్థితిని మార్చిందని, ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చింది. దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ప్రస్తుతం సినిమా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మీనాక్షి తెలిపింది. నెట్టింట తన ఫోటోలతో రచ్చ చేస్తూ, సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.








