దేశ సర్వోన్నత న్యాయస్థానం మెడికల్ సీట్ల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉండటం పట్ల సుప్రీంకోర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వెయ్యి సీట్లు దాదాపు ఖాళీగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే దేశంలో వైద్యుల కొరత కొనసాగుతోంది. వైద్య సీట్లను భర్తీ చేయకపోవడం ఈ సమస్యను మరింత పెంచుతుంది.
పరిష్కార దిశలో చర్చలు
సుప్రీంకోర్టు దీనిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి, త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని కేంద్రానికి ఆదేశించింది. సెంట్రల్ గవర్నమెంట్ సైతం ఈ విషయంపై ఒక కమిటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. ఈ కమిటీ మూడు నెలల కాలంలో వైద్య సీట్ల భర్తీ ప్రక్రియపై సిఫారసులు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు ఈ అంశంపై తదుపరి విచారణ ఏప్రిల్ లో నిర్వహిస్తామని వెల్లడించింది.








