మేడారం చిన్నజాతర ప్రారంభం.. పోటెత్తిన భ‌క్తులు

మేడారం చిన్నజాతర ప్రారంభం.. పోటెత్తిన భ‌క్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. ఈ చిన్నజాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. మేడారం మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. మ‌ధ్యలో ఒక సంవ‌త్స‌రం చిన్నజాతరను నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతుంది.

మండమెలిగే పండుగతో మినీ జాతర ప్రారంభ‌మైంది. గురువారం మండమెలిగే పూజలు, శుక్రవారం భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం చిన్నజాతర నిర్వహణ జరుగుతాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతర ఏర్పాట్ల కోసం రూ.5.30 కోట్లు కేటాయించింది. భక్తుల సౌకర్యార్థం పోలీస్ బందోబస్తు, నీటి సరఫరా, శుభ్రత, రవాణా సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి కూడా లక్షలాది మంది భక్తులు మేడారం చిన్నజాతరకు తరలివస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఈ ఏడాది 20 లక్షలకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా చేరుకోవడంతో మేడారం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment