‘సనమ్ తేరీ కసమ్’ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మావ్రా హొకేన్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. పాకిస్థాన్ నటుడు అమీర్ గిలానీను ప్రేమించి, తాజాగా పెళ్లి చేసుకొని అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఈ జంట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న విషయం నిన్న వెలుగులోకి వచ్చింది. పెళ్లి అనంతరం మావ్రా హొకేన్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఆమె సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ, “గందరగోళం మధ్యలో… నేను నిన్ను కనుగొన్నాను” అని భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
అందమైన కెమిస్ట్రీ కలిగిన ఈ జంటకి ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారి ప్రేమకు పెళ్లి రూపంలో హ్యాపీ ఎండింగ్ రావడం అభిమానులను ఖుషీ చేసింది.