ప్రియుడి (Lover’s) వీడియో కాల్ (Video Call) కు స్పందించకపోవడంతో మనస్తాపానికి (Depression) గురైన ఓ వివాహిత (Married Woman) ఉరేసుకుని (Hanged Herself) ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆమె మరణించింది. ఈ మరణానికి ప్రియుడే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి అతని ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, నేరేడుచర్ల (Nereducharla) మండలం బోడలదిన్నె (Bodaladinne) గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని (Malgi Reddy Ashwini) (35) తన భర్త, కుమార్తెతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్ (Hyderabad)లోని ఎల్‌బీనగర్ (LB Nagar)లో నివాసం ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన కందుకూరి సురేష్‌రెడ్డి (Kandukuri Suresh Reddy) కూడా ఎల్‌బీనగర్‌లోనే నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో అశ్విని, సురేష్‌రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్‌రెడ్డికి వీడియో కాల్ చేసి “నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా” అని చెప్పింది. దీనికి సురేష్‌రెడ్డి “నేను రాను” అని సమాధానం చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
అనంతరం అనుమానం వచ్చి సురేష్‌రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అశ్విని తుదిశ్వాస విడిచింది.
మృతదేహంతో ఆందోళన
అశ్విని మృతికి సురేష్‌రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్‌రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్‌రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.







