ఆయుధాలు వ‌దిలి.. లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

ఆయుధాలు వ‌దిలి.. లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని పోలీసు బెటాలియన్ (Police Battalion) కార్యాలయం శనివారం ఉదయం ఓ కీలక మలుపు చూసింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) సరిహద్దుల్లో సుదీర్ఘకాలంగా సాయుధ పోరాటం సాగిస్తున్న 86 మంది మావోయిస్టులు (Maoists) తమ ఆయుధాలు (Weapons) వదిలి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఈ లొంగింపు ప్రక్రియకు ప్రభుత్వం చేపట్టిన పునరావాస పథకం, వరుస ఎన్‌కౌంటర్ల (Encounters) ఒత్తిడి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ప్రజాస్రవంతిలో భాగమయ్యేలా నిర్ణయించుకున్న ఈ మావోయిస్టులకు ప్రభుత్వం రూ.25,000 చెక్కులను మరియు పునరావాస సహాయాన్ని అందించింది.

ఈ చర్య, రాష్ట్రంలో మావోయిజం అదుపులోకి వస్తున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్‌లో మరింత మంది మావోయిస్టులు సామాన్య జీవితాన్ని కోరుకుంటూ ముందుకు వస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment