మూడు రాష్ట్రాల సీఎంలకు ‘మావోయిస్ట్ పార్టీ బహిరంగ లేఖ’

మూడు రాష్ట్రాల సీఎంలకు 'మావోయిస్ట్ పార్టీ బహిరంగ లేఖ'

ఆప‌రేష‌న్ క‌గార్‌ (Operation Kagar)తో జ‌రుగుతున్న వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల (Encounters) నేప‌థ్యంలో మావోయిస్టుల (Maoists) నుండి కీలక ప్రకటన వెలువడింది. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh), మహారాష్ట్ర రాష్ట్రాల ముఖ్యమంత్రుల (Chief Ministers)కు బహిరంగ లేఖ (Open Letter) రాసిన మావోయిస్టు పార్టీ, ఆయుధ విరమణపై తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిలిపివేస్తే, ఆయుధాలను పూర్తిగా వదిలే తేదీని ప్రకటించేందుకు సిద్ధమని మావోయిస్టులు స్పష్టం చేశారు.

మావోయిస్ట్ పార్టీ బ‌హిరంగ లేఖలో.. “మేము ఆయుధాలు విడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, మొదట ప్రభుత్వాలు కూంబింగ్ ఆపరేషన్లు ఆపాలి. ఆ ఆపరేషన్లు నిలిచిన రోజునుంచి మా పార్టీ తరపున ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తాం” అని మావోయిస్టులు పేర్కొన్నారు. సీసీఎం (కేంద్ర కమిటీ) (CCM – Central Committee)లో తీసుకున్న నిర్ణయం మేరకు, పార్టీ అంతర్గతంగా జోనల్ కమిటీలకు సమాచారం చేరవేసినట్లు కూడా వెల్లడించారు.

ఇటీవల బస్వరాజు (Basavaraju) ఎన్‌కౌంటర్‌ (Encounter) తర్వాత పార్టీ విభాగాల పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పుల అవశ్యకతను గుర్తించిన మావోయిస్టులు, ఈ నేపథ్యంలోనే ఆయుధ విరమణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. తమ నిర్ణ‌యాల‌ను ప్రభుత్వాలు గౌరవించి, శాంతి చర్చలకు తగిన వాతావరణం సృష్టించాలని మావోయిస్టులు కోరారు.

దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఈ ప్రకటన కీలక మలుపుగా భావిస్తున్నారు. ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment