గుంటూరులో సినిమా డైరెక్ట‌ర్‌పై దాడి.. వీడియో వైర‌ల్‌

గుంటూరులో సినిమా డైరెక్ట‌ర్‌పై దాడి.. వీడియో వైర‌ల్‌

టాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై జరిగిన దాడి సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన సినిమా సక్సెస్ టూర్‌లో భాగంగా గుంటూరు శివ థియేటర్ వద్ద జరిగింది. ద‌ర్శ‌కుడు కిర‌ణ్ తిరుమ‌ల‌శెట్టి తాజాగా తెరకెక్కించిన “డ్రింకర్ సాయి” సినిమాలో ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణను కించపరుస్తున్నట్లు భావించే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన అభిమానులు ఆగ్రహంతో విచక్షణారహితంగా దాడి చేశారు.

మూవీ టీమ్ గుంటూరులో శివ థియేట‌ర్ వ‌ద్ద‌ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి హ‌ఠాత్తుగా మంతెన స‌త్య‌నారాయ‌ణ అభిమానులు దాడిచేశారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీని పట్ల అభిమానుల మధ్య చర్చలు పెరుగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment