గతేడాది నుంచి మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఈ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తాజాగా ఆలస్యంగా స్పందించారు. ప్రజల బాధలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు తెలిపారు.
“గత సంవత్సరం మే 3 నుండి ఈ రోజు వరకు జరిగిన హింసాత్మక ఘటనలు నా మనసును బాధిస్తున్నాయి. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి. తమ ఇళ్లను విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితుల్లో బాధ, ప్రజల త్యాగం నాకు తెలుసు. ఇప్పుడు మనందరం గతాన్ని మరిచి, శాంతియుతమైన జీవితానికి పునఃప్రారంభం చేయాలని ప్రజలను, అన్ని సంఘాలను కోరుతున్నాను” అని సీఎం బీరెన్ సింగ్ పిలుపునిచ్చారు. సీఎం వ్యాఖ్యలపై మణిపూర్ ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.