- పవన్‌పై గేమ్‌ఛేంజర్ మృతుల కుటుంబాలు ఫైర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ఫై మణికంట, చరణ్ కుటుంబ సభ్యులు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో గత శనివారం జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన చరణ్, మణికంఠ అనే ఇద్దరు మెగా అభిమానులు హాజరయ్యారు. వారు తిరిగి ఇంటికి వెళ్తుండగా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
నిన్న పిఠాపురంలో ప్రభుత్వానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మృతులు మణికంఠ, చరణ్ కుటుంబాలను పవన్ పరామర్శిస్తారని పిలిపించారు. మొదట తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన బాధిత కుటుంబాల సభ్యులను పవన్ కళ్యాణ్ కార్యక్రమం జరిగే చోటుకు అధికారులు తీసుకెళ్లారు. కాగా, పవన్ సభ జరిగేంతసేపు తమను వేర్వేరు చోట్ల కూర్చోబెట్టారని బాధితులు వాపోయారు.
పవన్ కళ్యాణ్ మాకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు : చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2025
పవన్ కళ్యాణ్ కనీసం మమ్మల్ని పలకరించలేదు
యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయాడు
మేము లక్షలు, కోట్లు అడగలేదు…2 నిమిషాలు సమయం అడిగాం
మమ్మల్ని పలకరించనప్పుడు ఎందుకు రమ్మన్నారు ?
మా… pic.twitter.com/19ANO8wxph
పవన్‌పై ఫైర్
ప్రభుత్వం కార్యక్రమం చూసుకొని పవన్ కళ్యాణ్ వెళ్లిపోవడంపై బాధిత కుటుంబాలు తీవ్రంగా మండిపడ్డాయి. పవన్ కళ్యాణ్ తమకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి నిరీక్షించినా, కనీసం తమను పవన్ పలకరించలేదని,
యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాము లక్షలు, కోట్లు అడగలేదని, తమను పలకరిస్తే కొంత ఓదార్పు దొరికేదని, తమను పలకరించడానికి సమయం లేనప్పుడు ఎందుకు రమ్మన్నారు..? అని ప్రశ్నించారు. ‘మా పిల్లలు పోయారు ఇప్పుడు మేము కూడా చనిపోతాం’ అని మృతులు చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు వారి ఆవేదనను మీడియాకు వివరించారు. పవన్ కళ్యాణ్ ఈవిధంగా వ్యవహరించడంపై స్థానికులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.