లోకేష్ ఇలాకాలో దారుణం.. 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

లోకేష్ ఇలాకాలో దారుణం.. 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

మ‌హిళ‌లు, ఆత్మ గౌర‌వం, మ‌హిళా ర‌క్ష‌ణ గురించి వేదిక‌పై ఉప‌న్యాసాలు ఇచ్చే మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో (Mangalagiri Constituency) చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మంత్రి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోని మంగళగిరి స్థానిక రైల్వే స్టేషన్‌కు వచ్చిన 13 ఏళ్ల మైనర్ బాలిక (13-year-Old Minor Girl)పై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌ (Gang Rape)కు పాల్పడ్డారు. ఈ ఘటన ఆడబిడ్డల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 18న బాలిక (13) రైల్వే స్టేషన్‌లో ఎంక్వైరీ కోసం అక్కడికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెను మాటలతో మోసం చేసిన నలుగురు వ్యక్తులు ఆటోలో ఎక్కించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో మంగళగిరిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. “13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే… అది మంత్రి లోకేష్ నియోజకవర్గంలోనే జరిగితే పాలకులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా?” అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ మురళీకృష్ణ (DSP Murali Krishna) తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు ఎస్కే ఖాదర్ బాషా (SK Khader Basha), సలీం (Saleem), రబ్బాని (Rabbani), సాహెబ్‌ (Saheb)లను ఆదివారం అదుపులోకి తీసుకుని అరెస్టు(Arrested) చేశారు. బాలికకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించగా, పూర్తి విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment