‘కన్నప్ప’ ఓటీటీ రిలీజ్ ఆ రోజేనా?

'కన్నప్ప' ఓటీటీ రిలీజ్ ఆ రోజేనా?

మంచు విష్ణు (Manchu Vishnu) నటించి, నిర్మించిన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం థియేటర్లలో విడుదలై నెల రోజులు కావస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ(OTT)లోకి రాబోతుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించిన ఈ ‘భక్త కన్నప్ప’ కథాంశంతో రూపొందిన సినిమాకు మొదట్లో సానుకూల స్పందన వచ్చినా, వసూళ్లపరంగా నిరాశపరిచింది. దాదాపు ₹200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కేవలం ₹40-50 కోట్లు మాత్రమే రాబట్టిందని టాక్.

విడుదలకు ముందు ఓటీటీ హక్కులు అమ్మలేదని విష్ణు చెప్పినా, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో జులై 27న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment