కన్నప్ప బడ్జెట్ చెబితే ఐటీ రైడ్స్.. – విష్ణు కీల‌క స్టేట్‌మెంట్‌

కన్నప్ప బడ్జెట్ చెబితే ఐటీ రైడ్స్ జ‌రుగుతాయ్‌.. - విష్ణు కీల‌క స్టేట్‌మెంట్‌

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా, భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం కన్నప్ప (Kannappa), ఈ నెల 27న థియేటర్లలో (Theaters) విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ (Hard Disk) దొంగతనం (Theft) జరిగిన విషయం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఆ గందరగోళం ఒకవైపు ఉంటే, విష్ణు ఇప్పటికే సినిమా ప్రమోషన్లను జోరుగా మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తెలుగులో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొని, కన్నప్ప బడ్జెట్‌ (Budget)కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇంటర్వ్యూయర్ సినిమా బడ్జెట్ గురించి అడిగినప్పుడు, విష్ణు “కచ్చితంగా మూడంకెల బడ్జెట్ (Three Digit Budget) అయింది” అని సమాధానమిచ్చాడు. రూ.100 కోట్లా, రూ.200 కోట్లా అని మళ్లీ ప్రశ్నించగా, “ఈ ఏడాది రిలీజైన చిత్రాల కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ. అలాగే, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓజీ (OG) కంటే కూడా మా సినిమా బడ్జెట్ పెద్దది” అని స్పష్టం చేశాడు. అయితే, “క‌చ్చితమైన బడ్జెట్ చెప్పమంటే, ఐటీ వాళ్లు మా ఆఫీస్‌కి వస్తారు. ఈ గొడవ ఎందుకు?” అని నవ్వుతూ జవాబిచ్చాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కన్నప్ప తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన విష్ణు, గత కొన్నేళ్లుగా ఈ సినిమా కోసం శ్రమిస్తున్నాడు. ఈ చిత్రంలో విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటులు నటించారు. దీంతో సినిమాపై మంచి బజ్ ఉంది. అయితే, మొదటి టీజర్ విడుదలైనప్పుడు కొంత ట్రోలింగ్ ఎదురైంది. తర్వాత విడుదలైన రెండో టీజర్ ఆ ట్రోలింగ్‌ను కొంత తగ్గించింది. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న కన్నప్ప, మంచు విష్ణు కెరీర్‌ను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి

Join WhatsApp

Join Now

Leave a Comment