మంచు ఫ్యామిలీ వివాదం కొత్తమలుపు తీసుకుంది. గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు వెళ్లిన ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధిపై మైక్‌తో దాడి చేశారు మోహన్ బాబు. వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మోహన్‌బాబు ముందు జర్నలిస్ట్ మైక్ ఉంచారు. ఆ మైక్‌ను లాగేసుకొని దానితో ఆ జర్నలిస్ట్‌పై మోహన్‌బాబు దాడి చేశారు.
జర్నలిస్టుల ఆగ్రహం
మోహన్‌బాబు దాడి ఘటన జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. మీడియా ప్రతినిధుల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం వివాదాస్పదంగా మారింది. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించారని జర్నలిస్టులు మండిపడుతున్నారు. మోహన్ బాబు ఈ విషయంలో ఎలాంటి వివరణ ఇవ్వనున్నారో వేచిచూడాలి.
ఆత్మగౌరవం కోసం నా పోరాటం : మనోజ్
ఇదిలా ఉండగా.. జల్‌పల్లిలోని మంచు మోహన్‌బాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని చెప్పారు. ఈ అంశం తన భార్యాపిల్లల సేఫ్టీకి సంబంధించిందన్నారు. మగాడిలా తనతో డైరెక్ట్‌గా వచ్చి పోరాడాలని, తనను తొక్కేయడానికి తన భార్య బిడ్డల పేర్లను ఇన్‌క్లూడ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రొటెక్షన్ కావాలని పోలీసులను ఆశ్రయించానని, తనకు రక్షణ కల్పిస్తానని చెప్పి వారు ఎందుకు వన్‌సైడ్ తీసుకుంటున్నారని ప్రశ్నించారు.