తిరుపతి జిల్లా రంగంపేట ఈరోజు ఒక ప్రత్యేక ఆహ్లాదానికి వేదికగా మారనుంది. ప్రముఖ నటుడు మంచు మనోజ్ రంగంపేటకు రానున్నారని సమాచారం. ఆయన అక్కడ నిర్వహించబోయే జల్లికట్లు క్రీడల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీకి కూడా వెళ్లనున్నారని సమాచారం. ప్రస్తుతం యూనివర్సిటీలో మోహన్ బాబు, విష్ణులు ఉన్నారు. మనోజ్ కూడా అక్కడికి వెళ్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
నారావారిపల్లెకు కూడా..
మంచు మనోజ్ నారావారిపల్లెకు కూడా వెళ్లవచ్చనే మాట వినిపిస్తోంది. ఈ ప్రయాణాల వెనుక కారణాలు తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.