”శివయ్యా.. అంటే శివుడు రాడు” – మంచు మ‌నోజ్ సెటైర్లు వైర‌ల్‌ (Video)

''శివయ్యా.. అంటే శివుడు రాడు'' - మంచు మ‌నోజ్ సెటైర్లు వైర‌ల్‌ (Video)

టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘భైరవం’ (Bhairavam) ట్రైలర్ మే 1న ఏలూరులో గ్రాండ్‌గా విడుదలైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం, పెన్ స్టూడియోస్‌తో కలిసి మే 30న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన ఎమోషనల్ స్పీచ్, తన సోదరుడు మంచు విష్ణుపై వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ తన జీవితంలో ఇటీవల ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. “సినిమా తప్ప నాకు ఏమీ తెలియదు. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇటీవల నా జీవితంలో చాలా పరిణామాలు జరిగాయి. నన్ను రోడ్డున పడేశారు, కానీ నేను ఇప్పుడు తిరిగి నిలబడ్డాను,” అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈ సందర్భంగా ఒక స్పెషల్ AV (ఆడియో-విజువల్) ప్రదర్శించగా, దాన్ని చూసి మనోజ్ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఎమోషనల్ మూమెంట్ ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులను కదిలించింది.

విష్ణుపై సెటైర్లు
మంచు మనోజ్ తన స్పీచ్‌లో తన సోదరుడు మంచు విష్ణును ఉద్దేశించి సెటైరికల్ కామెంట్స్ చేశారు, ఇవి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. “శివయ్య అంటే శివుడు రాడు. శివుడ్ని మనసారా తలుచుకుంటే, డైరెక్టర్ రూపంలో, ప్రొడ్యూసర్ రూపంలో, మీ అందరి రూపంలో వస్తాడు,” అంటూ మనోజ్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్‌ను విష్ణు నిర్మిస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) చిత్రంతో ముడిపెడుతూ, అన్నపై ఇన్‌డైరెక్ట్ సెటైర్‌గా భావిస్తున్నారు. గతంలో మనోజ్, ‘కన్నప్ప’ చిత్రానికి పోటీగా ‘భైరవం’ను విడుదల చేయాలనుకున్నానని, దీంతో ‘కన్నప్ప’ పోస్ట్‌పోన్ అయిందని చెప్పిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment