---Advertisement---

‘ద‌మ్ముంటే నాతో చ‌ర్చ‌కు రా’.. ముదురుతున్న మాటల యుద్ధం

'ద‌మ్ముంటే నాతో చ‌ర్చ‌కు రా'.. ముదురుతున్న మాటల యుద్ధం
---Advertisement---

ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌బాబు త‌న‌యులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్లు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ‘‘కుక్క-సింహం’’ అంటూ ప్రస్తావన చేసిన మనోజ్ వ్యాఖ్య‌ల‌కు అన్న విష్ణు కౌంట‌ర్ ఇవ్వ‌గా, ఆయ‌న‌ వ్యాఖ్యలకి మనోజ్ తాజా ట్వీట్ రూపంలో సవాల్ విసిరారు.

“ఒకసారి కూర్చుని మాట్లాడుదాం”: మనోజ్ ఛాలెంజ్
విష్ణుకి ప్రతిస్పందనగా మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో, ‘‘మహిళలు, నాన్న, ఇంట్లోని స్టాఫ్‌ను పక్కన పెట్టి మనిద్దరం కూర్చుని మాట్లాడుకుందాం. నేను ఒక్కడినే వస్తా. నీకు ఎవరు కావాలంటే వారిని తీసుకురా. లేకపోతే ఓపెన్ హెల్తీ డిబేట్‌కు సిద్ధమవ్వు’’ అంటూ తన అన్న విష్ణుకు సవాల్ విసిరారు.

పరిష్కారానికి దారులు వెతుకుతున్న అభిమానులు
మంచు కుటుంబం పట్ల గౌరవం ఉన్న అభిమానులు, ఈ వివాదం త్వరగా పరిష్కారమై అన్నదమ్ముల మధ్య మంచి వాతావ‌ర‌ణం నెలకొనాలని కోరుకుంటున్నారు. ఇలాంటి మాటల యుద్ధం మంచు కుటుంబ ప్రతిష్ఠకు తగలకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment