ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవల నడుమ ఆయన కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న ఓ ఆసక్తికరమైన మెసేజ్‌తో మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. “ఈ లోకంలో ఏదీ నీది కానప్పుడు, ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు” అంటూ ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. మంచు లక్ష్మీ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెటిజన్ల చర్చలు
లక్ష్మీ ప్రసన్న ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందన్నదానిపై నెటిజన్లలో ఊహాగానాలు మొదలయ్యాయి. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య గత నాలుగు రోజులుగా వివాదం జరుగుతోందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పోస్ట్ ఆ కుటుంబ విభేదాలకు సంబంధించి ఉందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.