స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి కోడలు.. వీడియో వైరల్!

స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి కోడలు.. వీడియో వైరల్!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునే కొత్తతరం నాయకులు వినూత్నంగా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ కోవలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) కోడలు ప్రీతి రెడ్డి (Mallareddy) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఉన్నత విద్యను అభ్యసించి, మల్లారెడ్డి విద్యా సంస్థల బాధ్యతలను, సామాజిక సేవ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ప్రీతి రెడ్డి, సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారు.

హుందాతనం వదిలి… విద్యార్థులతో డ్యాన్స్!

ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలో ప్రీతి రెడ్డి ఎలాంటి హుందాతనం చూపించకుండా, ఎంతో ఎనర్జిటిక్‌గా, అదిరిపోయే స్టెప్స్‌తో మల్లారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి సరదాగా డ్యాన్స్(Dance) చేశారు. ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుంటే, వెనుకనే ఉన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఆసక్తిగా గమనించడం కనిపించింది.

నిజానికి రాజకీయ కుటుంబ సభ్యులు ఇలా బహిరంగంగా డ్యాన్స్ చేయడం అరుదు. ఈ వీడియో చూసిన నెటిజన్స్… “అంత ఉన్నత స్థానంలో ఉండి కూడా మొహమాటం లేకుండా డ్యాన్స్ చేయడం సూపర్” అంటూ ఆమెను మెచ్చుకుంటున్నారు. యువతకు దగ్గరయ్యేందుకు ప్రీతి రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తు రాజకీయాల కోసమేననే చర్చ కూడా జోరుగా సాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment