నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద మృతి

నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద మృతి

మలయాళ నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో ఆయన శవమై కనిపించారు. సమాచారం ప్రకారం, రెండు రోజుల క్రితం దిలీప్ హోటల్ గదిని బుక్ చేసుకున్నాడు. అప్ప‌టి నుంచి గది వ‌దిలి బయటకు రాకపోవడం హోటల్ సిబ్బందిలో అనుమానం రేకెత్తించింది.

ఆదివారం రోజున‌ గదిలో నుండి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గదిని తెరిచారు. ఈ క్రమంలో ఆయన మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దిలీప్ శంకర్ మృతిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన మలయాళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

దిలీప్ శంకర్ పలు సీరియల్స్‌లో ప్రముఖ పాత్రలు పోషించారు. ఫ్లవర్స్ టీవీలో ఓ సీరియల్‌లో దిలీప్ శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హాటల్ చనిపోయినా మృతిలో ఎలాంటి అనుమానాలు లేవని ప్రాథమిక అంచనా. ఫోరెన్సిక్ బృందం గదిని తనిఖీ చేస్తుందని కన్వెన్షన్ ఎస్పీ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment