అంబర్‌పేట ఫ్లైఓవర్ వ‌ద్ద‌ భారీ అగ్నిప్రమాదం

అంబర్‌పేట ఫ్లైఓవర్ వ‌ద్ద‌ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట్ ఫ్లైఓవర్ కింద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ‌ ఉదయం చే నంబర్‌ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది.

ట్రాఫిక్ జామ్ – ప్రజలు తీవ్ర ఇబ్బందులు
పొగ కారణంగా అంబర్‌పేట్ ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment