‘గ్లోబ్ ట్రాటర్’ (Globe Trotter) సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ఈవెంట్ రేపు (నవంబర్ 15, శనివారం) సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)లో జరగనుంది. ఈవెంట్ ఏర్పాట్లపై రాజమౌళి ఇప్పటికే వివరాలు వెల్లడించగా, తాజాగా మహేశ్ బాబు కూడా అభిమానులను ఉద్దేశించి స్పెషల్‌గా రిక్వెస్ట్ (Special Request) చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా మహేశ్ బాబు భద్రత విషయంలో పలు ముఖ్య సూచనలు చేశారు. ఈవెంట్‌కు ఫిజికల్ పాసులు (పాస్‌పోర్ట్ తరహాలో జారీ చేసినవి) ఉన్న వారు మాత్రమే రావాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, రేపు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంటుందని, కాబట్టి పాస్ మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వచ్చే గూగుల్ మ్యాప్ ప్రకారం ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ నుంచి రావాలని అభిమానులను కోరారు. ట్రాన్స్‌పోర్టేషన్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలని, పోలీసులు కండీషన్స్ చాలా స్ట్రిక్ట్‌గా పెట్టారని, అందుకే తక్కువ వాహనాలతో వస్తేనే ఇంకా బెటర్ అని మహేశ్ సూచించారు.
చివరగా, మహేశ్ బాబు అభిమానుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, “మనకు ఇంకా చాలా ఈవెంట్లు జరుగుతాయి. సేఫ్టీగా వచ్చి, వెళ్లడం ఇంపార్టెంట్ కాబట్టి, అందరూ జాగ్రత్తగా రావాలి. రేపు ఈవెంట్‌లో కలుద్దాం” అంటూ అభిమానులను కోరారు. ఈ భారీ ఈవెంట్ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి కార్యక్రమంలో సినిమా మహేశ్ బాబు లుక్, టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నందున, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.







