అరగంటలో రూ.2 కోట్ల సెట్ వృథా.. మహేశ్ బాబు కారణమా?

అరగంటలో రెండు కోట్ల సెట్ వృధా.. మహేశ్ బాబు కారణమా?

సూపర్‌స్టార్ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S.Rajamouli)  కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (‘SSMB29) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచస్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన ఒక షాకింగ్ సంఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

అసలేం జరిగింది?
రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)లో ఈ సినిమా కోసం ఒక భారీ సెట్‌ (Huge Set)ను నిర్మించారు. ఒక చెరువు పక్కన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. షూటింగ్‌కు మహేశ్ బాబు వచ్చిన తర్వాత, కేవలం అరగంట మాత్రమే అక్కడ ఉన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మహేశ్ ఇబ్బంది పడి, “నా వల్ల కాదు, సారీ” అని చెప్పి వెళ్లిపోయారని సమాచారం. దీనితో ఆ రోజు షెడ్యూల్ పూర్తిగా రద్దు చేయబడింది. ఈ పరిణామం వల్ల దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో వేసిన సెట్ వృథా అయిందని సినీ వర్గాల టాక్.

ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు
ఇలాంటి సంఘటన మహేశ్ బాబుకు కొత్తేమీ కాదని, గతంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇలాగే జరిగిందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఎండలో పాట చిత్రీకరణకు మహేశ్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, అదే పాటను ఇండోర్‌లో అవుట్‌డోర్ సెట్‌గా మార్చి చిత్రీకరించారు. ఈ సంఘటన తర్వాత, ఇప్పుడు రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడి సినిమాలోనూ ఇలా జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment