సూప‌ర్ స్టార్ మహేశ్ బాబుకు నోటీసులు

సూప‌ర్ స్టార్ మహేశ్ బాబుకు నోటీసులు

టాలీవుడ్ సూపర్ స్టార్ (Super Star) మహేశ్ బాబు (Mahesh Babu)కు నోటీసులు (Notices) జారీ అయ్యాయి. ఈ వార్త సినీ పరిశ్రమతో పాటు వ్యాపార వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరమ్ (Forum) ఆయనకు తాజాగా ఈ నోటీసులు ఇచ్చింది. బ్రాండ్ అంబాసిడర్‌ (Brand Ambassador)గా వ్యవహరించిన ఒక కేసులో మహేశ్ బాబును మూడవ ప్రతివాదిగా చేర్చడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. మెస్సర్స్ (Messrs) సాయి సూర్య డెవలపర్స్ (Sai Surya Developers)అనే రియల్ ఎస్టేట్ సంస్థ తమ వెంచర్‌ (Venture)కు మహేశ్ బాబును బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ ప్రకటనల ద్వారా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రకటనల్లో మహేశ్ బాబు ఫొటోలు, ఆయన మాటల ద్వారా వెంచర్ విశేషాలను హైలైట్ చేశారు.

దీనిని నమ్మి ఫిర్యాదుదారులు సంస్థపై నమ్మకం ఉంచి డబ్బులు చెల్లించగా, ఆ తర్వాత అభివృద్ధిలో జాప్యం, ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించడం, ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వంటి అంశాలతో తాము మోసపోయామని వారు పేర్కొన్నారు. మహేశ్ బాబు వంటి స్టార్‌ను నమ్మి పెట్టుబడి పెట్టినందుకే తాము నష్టపోయామని, అందుకే ఆయనను కూడా ఈ కేసులో భాగం చేశామని బాధితులు వాదిస్తున్నట్లు సమాచారం.

అయితే, ఈ కేసుపై ఇప్పటివరకు మహేశ్ బాబు తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన టీమ్ దీనిపై ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment