మహేష్ బాబు ధరించిన టీ-షర్ట్ అన్ని లక్షలా?

మహేష్‌బాబు ధరించిన టీ-షర్ట్ అన్ని లక్షలా..?

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) వెడ్డింగ్ రిసెప్షన్‌ (Wedding Reception)లో మహేష్ బాబు (Mahesh Babu) ధరించిన కలర్ ఫుల్ టీ-షర్ట్ (Colourful T-shirt) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఈ ఖరీదైన టీ షర్ట్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రిన్స్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

స్టార్ హీరోలు, క్రికెటర్లు ధరించే చొక్కాలు, ప్యాంటు, బ్యాగులు, చెప్పుల ధరల గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు బహిరంగంగా కనిపించినప్పుడు వారు ధరించే డ్రెస్‌ల‌ ధరల గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన టీ-షర్ట్ పై కూడా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇటీవలే పెళ్లిపీటలెక్కాడు. జైనబ్‌ రవ్జీ (Zainab Rauvji)తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం (జూన్ 8) హైదరాబాద్‌లోని అక్కినేని స్టూడియోస్‌ (Akkineni Studios)లో గ్రాండ్ రిసెప్షన్ (Grand Reception) జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అక్కినేని అఖిల్ వివాహం జరిగింది. దీంతో నాగార్జున ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు చాలా మంది సెలబ్రిటీలను ఆహ్వానించారు. అందుకు తగ్గట్టుగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అఖిల్-జైనాబ్ ల రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార రిసెప్షన్ కు వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ బాబు ధరించిన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా టీ షర్ట్ సింపుల్ గా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దుస్తుల బ్రాండ్ ‘హెర్మ్స్’ (Hermès) నుండి వచ్చిన టీ-షర్ట్. దీని ధర సుమారు 1.51 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ టీషర్ట్ ధరతో ఒక లగ్జరీ బైక్ కొనుగోలు చేయవచ్చని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment