టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సతీమణి, మాజీ నటి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) నేడు (జనవరి 22) 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా భార్యకు ఎమోషనల్ బర్త్‌డే విషెస్ (Emotional Birthday Wishes) తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లో “హ్యాపీ బర్త్‌డే ఎన్‌ఎస్‌జీ (Happy Birthday NSG).. ప్రతి విషయంలోనూ వెలకట్టలేని ప్రేమతో, ఓపికతో నా వెంటే నిలబడుతున్నావు. అంతకంటే ఎక్కువ నేను కోరుకోలేను” అంటూ తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు, సెలబ్రిటీలు నమ్రతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నమ్రత–మహేశ్‌ది ప్రేమ వివాహం కాగా, వంశీ సినిమా షూటింగ్ సమయంలో మొదలైన పరిచయం ప్రేమగా మారి 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరమై కుటుంబానికే తన సమయాన్ని అంకితం చేసింది. మహేశ్ సినిమాల షెడ్యూల్స్ నుంచి వ్యాపార, ఆర్థిక వ్యవహారాల వరకు అన్నింటిలోనూ కీలక పాత్ర పోషిస్తూ కుటుంబానికి బలంగా నిలుస్తోంది. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ భారీ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.








