మహాత్మా గాంధీ ముని మనవరాలు మృతి

మహాత్మా గాంధీ ముని మనవరాలు మృతి

భార‌త‌దేశ (India) జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) మనవరాలు (Granddaughter) నీలాంబెన్ పారిఖ్ (Nilamben Parikh) (93) మృతిచెందారు. మంగ‌ళ‌వారం రాత్రి గుజ‌రాత్ రాష్ట్రం నవ్‌సరి (Navsari) లోని త‌న నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. త‌న వ‌యోభారంతోనే నీలాంబెన్ పారిఖ్ మృతిచెందిన‌ట్లుగా కుటుంబీకులు తెలిపారు. పారిఖ్ మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ (Haridas Gandhi) కుమార్తె. నీలాంబెన్ అంత్యక్రియలు బుధవారం వీర్వాల్ (Virwal) శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. నీలాంబెన్ పారిఖ్ గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment