కొంప ముంచిన సిబిల్ స్కోర్.. పెళ్లి క్యాన్సిల్‌

కొంప ముంచిన సిబిల్ స్కోర్.. పెళ్లి క్యాన్సిల్‌

ఈ ఆధునిక కాలంలో పెళ్లి చేసుకోవాలంటే మంచి కుటుంబం, ఆస్తిపాస్తులు ఉంటే సరిపోదు. ఆర్థిక స్థిరత్వం కూడా ఎంతో ముఖ్యమైన విషయం. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన పైవ్యాఖ్య‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తుంది. స్థానిక సమాచారం ప్ర‌కారం.. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. వివాహానికి తేదీ కూడా ఖరారు చేసుకున్నారు. అయితే పెళ్లికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ, వరుడి సిబిల్ స్కోర్ (CIBIL Score)‌ను పరిశీలించారు. అందులో వరుడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు, అతని క్రెడిట్ స్కోర్ చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

దీంతో అత‌న్ని పెళ్లి చేసుకుంటూ ఆర్థికంగా భద్రత ఉండ‌ద‌ని వ‌ధువు కుటుంబ స‌భ్యుల‌కు చెప్పాడు. దీంతో వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేవలం కుటుంబం, ఆస్తి మాత్రమే కాకుండా, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా చూడడం చాలా మంచిది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (CIBIL) అందించే రేటింగ్. ఇది వ్యక్తుల ఆర్థిక నిబద్ధత, రుణ చెల్లింపుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులు రుణాలు మంజూరు చేసేముందు ఈ స్కోరును పరిశీలిస్తాయి. మంచి స్కోర్ ఉంటే రుణం పొందడం సులభం, తక్కువ స్కోర్ ఉంటే రుణ మంజూరులో ఆటంకాలు ఎదురవుతాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment