మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ పూర్తి అయ్యింది. నాగ్‌పూర్‌లోని రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహాయుతి భాగస్వామ్యంలోని ప్రధాన పార్టీలకు కేటాయించిన మంత్రుల సంఖ్య ఇలా ఉంది..
బీజేపీకి 19 మంది, శివసేన (షిండే వర్గం) 11 మంది, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎంతో కలిపి మొత్తం 43 మంది మంత్రులుగా కొనసాగవచ్చు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే ,అజిత్ పవార్ ఇప్పటికే తమ బాధ్యతలను చేపట్టారు.
రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా?
ఈ విస్తరణతో మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్టీలకు కేటాయించిన పదవులు వారి రాజకీయ బలాన్ని ప్రతిబింబిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ప్రభుత్వ స్థిరత్వంపై విశ్లేషణ కొనసాగుతుంది.







