ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా(Maha Kumbh Mela)లో తన మైమరపించే కళ్లతో అందరినీ ఆకర్షించిన మోనాలిసా (Monalisa) గురించి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. పూసల దండలు, రుద్రాక్షలు అమ్మేందుకు వచ్చిన ఈ బ్యూటీ.. తన అందమైన చిరునవ్వుతో నెటిజన్ల మనసులను దోచుకుంది. తన అందం, అభినయంతో బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసింది.
మూవీలో ఎంట్రీకి మోనాలిసా సిద్ధం
బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా (Sanoj Mishra) మోనాలిసాను తన సినిమా ‘‘ది డైరీ ఆఫ్ మణిపూర్’’ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం కేరళ వెళ్లారు. ఫ్లైట్‌లో స్పెషల్ గెస్ట్‌గా ప్రయాణం చేసిన మోనాలిసా ఎస్కలేటర్ పై వెళ్తుండగా కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే, ఈ విశేషాన్ని స్వయంగా సనోజ్ మిశ్రానే పంచుకున్నారు. ఈవెంట్‌లో మోనాలిసాతో దిగిన ఫొటోను షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.