తేనెకళ్ల అందంతో మహాకుంభమేళా(Mahakumbh Mela)లో అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా(Monalisa) ఇప్పుడు మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. సోషల్ మీడియా ప్రభావంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన మోనాలిసాకు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా సినిమా ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె త్వరలో సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతోంది. మోనాలిసా క్రేజీ కంట్రీ దాటింది.
నేపాల్ శివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మోనాలిసాను మరో అదృష్టం వరించింది. ఈనెల 26న నేపాల్‌లో జరుగనున్న మహాశివరాత్రి (Nepal Shivaratri) ఉత్సవాల్లో పాల్గొనాలని ఆమెకు ఆహ్వానం అందింది. కుంభమేళాలోనే ఆమెను గుర్తించిన నిర్వాహకులు ఈ ఆహ్వానం అందించారని సమాచారం. ఆమెతో పాటు దర్శకుడు సనోజ్ మిశ్రా, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఇటీవల కేరళలోని ఓ జువెలరీ షాప్ ఓపెనింగ్‌కు హాజరైన మోనాలిసాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సోషల్ మీడియా ఒక్కరి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో మోనాలిసా కథ మరో ఉదాహరణగా నిలుస్తోంది.