జనవరి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ సిద్ధమైంది. భక్తుల సౌకర్యాల కోసం ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తుల అవసరాలను తీర్చేందుకు మరియు భద్రతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సర్కారు తెలిపింది.
సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఏర్పాట్లు..
మహా కుంభమేళాకు సంబంధించిన ఏర్పాట్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని నిర్ణయించుకుంది. భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడం, వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటుచేయడం కోసం టెక్నాలజీని వినియోగిస్తామని ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి సురేశ్ ఖన్నా వెల్లడించారు.
తాత్కాలిక వసతులు, హస్పటల్స్
కుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడినట్లు మంత్రి తెలిపారు. ఇక, భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కుంభమేళా ప్రాంతంలో ఓ తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రిలో ప్రసవం కూడా జరిగిందని, గంగా నది ఒడ్డున ఉన్న డేరా పట్టణంలో జీవించే సోనమ్ అనే మహిళకు మొదటి ప్రసవం చేసినట్లు తెలిపారు.
భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, కుంభమేళా సందర్భంగా అందరికీ సౌకర్యవంతమైన అనుభవం ఇవ్వాలని ఎప్పటికప్పుడు చూసుకుంటామని అధికారులు మంత్రి సురేశ్ ఖన్నా వెల్లడించారు.